ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ నామినేషన్స్‌ని ప్రకటించారు.2022 సంవత్సరంలో రిలీజైన సినిమాలు ఈ అవార్డ్స్ రేసులో ఉండగా తెలుగులో అత్యధికంగా ఆర్ఆర్ఆర్ 11 కేటగిరిల్లో నామినేషన్ దక్కించుకోగా సీతారామం సినిమా 10 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది.తెలుగులో బెస్ట్ ఫిలిం కేటగిరిలో ఆర్ఆర్ఆర్, సీతారామం, కార్తికేయ 2, మేజర్, డీజే టిల్లు సినిమాలు పోటీలో ఉండగా ఏ సినిమా సైమా బెస్ట్ ఫిలిం అవార్డు సాధిస్తుందో చూడాలి.
తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాకు అత్యధికంగా 10 నామినేషన్స్ రాగా, కమల్ హాసన్ విక్రమ్ సినిమాకు 9 నామినేషన్స్ వచ్చాయి. కన్నడలో KGF 2, కాంతార సినిమాలు అత్యధికంగా 11 నామినేషన్స్ సాధించాయి. మలయాళంలో భీష్మపర్వం సినిమా అత్యధికంగా 8 నామినేషన్లు, తుళ్లుమల్ల సినిమా 7 నామినేషన్లు దక్కించుకున్నాయి.
Also Read:IND VS WI 3rd ODI:సిరీస్ భారత్‌దే
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) అవార్డు వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగనుండగా ఈసారి కూడా సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయిలో జరగనున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినిమాలకు ఈ అవార్డు వేడుకలు జరుగుతాయి.
Also Read:వైభవంగా శ్రావణ పౌర్ణమి పౌర్ణమి గరుడ సేవ