ఖతార్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ (సైమా) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు,కన్నడ,తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేశ్, రాధిక, శ్రియ, పాయల్ రాజ్‌పుత్, యశ్, విజయ్ దేవరకొండ తదితరులు హాజరయ్యారు.
ఈ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన మహానటి సినిమా మరోసారి అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఎంపికైతే ఉత్తమ నటుడిగా రామ్ చరణ్ ఎంపికయ్యారు.
ఇక సైమా అవార్డుల కార్యక్రమంలో మహానటి సావిత్రిని తలపించేలా సంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చింది కీర్తి. ఈ సందర్భంగా చిరంజీవి వద్దకు వెళ్లి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తమ చిత్రం : మహానటి
ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (రంగస్థలం)
ఉత్తమ నటుడు : రామ్‌చరణ్ (రంగస్థలం)
ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్ దేవరకొండ( గీత గోవిందం)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం)
సోషల్ మీడియాలో పాపులరైన స్టార్ : విజయ్ దేవరకొండ
ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( మహానటి)
ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)
ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)
ఉత్తమ విలన్ : శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (ఎంత సక్కగున్నవవే – రంగస్థలం)
ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా – ఆర్‌ఎక్స్ 100)
ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ – రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్ (విజేత)
ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్ రాజ్‌పుత్ (ఆర్‌ఎక్స్ 100)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్ భూపతి (ఆర్‌ఎక్స్ 100)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రంగస్థలం)