డీజే టిల్లు వంటి బ్లాక్ బస్టర్‌తో తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్వీసీసీ బ్యానర్‌పై రూపొందుతోన్న 37వ సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. బాపినీడు.బి సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా ఈ సినిమాను సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమానికి మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, యువీ క్రియేషన్స్ వంశీ, దామోదర్ ప్రసాద్, నందినీ రెడ్డి, రాధా మోహన్, కార్తీక్ వర్మ, సుబ్బు, మిర్యాల రవీందర్ రెడ్డి, కోన వెంకట్, నీరజ కోన తదితరులు హాజరయ్యారు.
Also Read:ఆ దర్శకుడితో పవన్‌కి గొడవ!
ఈ సందర్బంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ … భాస్కర్ డైరెక్టర్‌గా సిద్ధు జొన్నలగడ్డతో మా బ్యానర్లో సినిమా చేయటం ఎంతో హ్యాపీగా ఉంది. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది. హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.
Also Read:మెగాస్టార్ దాన్ని నిలబెట్టుకుంటాడా?