- Advertisement -
సిద్ధిపేట జిల్లాలో 70 రోజుల తరువాత దేవాలయాలు తెరుచుకున్నాయి. జిల్లాలో ప్రధాన దేవాలయాలైన కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి దేవాలయం, కొండపోచమ్మ దేవాలయం,వర్గల్ సరస్వతీ దేవాలయం,నాచారం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం,కొండపోచమ్మ దేవాలయం తెరచుకున్నాయి.
అలాగే బెజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం,పుల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం,సిద్ధిపేట కొత్త వెంకటేశ్వర స్వామి దేవాలయం,కోటి లింగాల దేవాలయం, పొట్లపల్లి స్వయంభూ రాజరాజేశ్వర స్వామి దేవాలయం,అనంత సాగర్ సరస్వతీ దేవాలయం,మర్పడగ సంతాన మల్లిఖార్జున స్వామి దేవాలయాల్లో భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. పరిమిత సంఖ్యలో భక్తుల దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా మసీదులు,చర్చిల్లో భక్తుల ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి.
- Advertisement -