మరోసారి మంచిమనసు చాటుకున్న హరీష్ రావు…ఈసారి ఏం చేశాడో తెలుసా?

268
Harish Rao

టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ తర్వాత రాష్ట్రంలో అంతటి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి హరీష్‌ రావు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలను తీర్చే ఆపద్భాందవుడుగా పేరు తెచ్చుకున్నాడు మన హరీషన్న. నమ్ముకున్న వారిని ఆపదలో అండగా నిలుస్తు..సిద్దిపేటను అన్ని విధాల అభివృద్ది చేసిన ఘనతా ఆయనకే దక్కుతుంది. నిత్యం ప్రజల బాగోగుల ఆలోచించే హరీషన్న తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వాట్సప్ లో వచ్చిన ఓ మెసెజ్ కు స్పందించి..తాను ఎక్కడున్న తన మనసంతా ప్రజలతోనే ఉంటుందని నిరూపించుకున్నాడు.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన జ్యోతి అనే 19ఏళ్ల బాలికకు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది. వైద్య సహాయం కోసం డబ్బులు లేకపోవడంతో ఆ పాప తల్లితండ్రులు దీపన్ అనే యువకుడి సహాయంతో హరీషన్నకు వాట్సప్ లో మెసెజ్ పంపించారు. ఆ మెసెజ్ చూసిన వెంటనే స్పందించి అతని కాల్ చేశారు. ప్రస్తుతం హరీష్‌ రావు కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో ఉన్నా..ప్రజల సమస్యలపై నిరంతం పోరాడుతూనే ఉంటాడన్న దానికి ఇదే నిదర్శనం.

దీంతో ఆ కుటుంబ సభ్యులు ఓఎస్డీని సంప్రదించగా హైదరాబాద్ మహానగరంలోని “NIMS”ఆసుపత్రిలో జ్యోతిని చేర్పించి అక్కడ ఉన్న ఆర్ఎంఓ సింధు డాక్టర్ గారితో మాట్లాడి రూ.25లక్షల ఖర్చు అయ్యే వైద్యాన్ని రూపాయి కూడా ఖర్చు లేకుండా వైద్యం చేయిస్తున్నారు హరీష్ రావు. ఇక హరిష్ రావు చేసిన పనికి పలువురు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.