ప్రజలను తప్పుదోవ పట్టించకండి:సీఎండీ ప్రభాకర్ రావు

271
prabhakar rao
- Advertisement -

తప్పుడు వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆంధ్రజ్యోతి పత్రికకు సూచించారు ట్రాన్స్‌కో,జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు. రామగుండం రెండో దశకు తెలంగాణ ప్రభుత్వం మోకాలడ్డుతుందనే వార్త నిరాధారం అని స్పష్టం చేశారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

యావత్ దేశమే కాదు ఇతర దేశాలు కూడా ఇవాళ తెలంగాణ వైపు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్టీపీసీ 2800 మెగావాట్ల ప్లాంట్ ఇప్పుడు కట్టేది పూర్తి అయితే 5 రూపాయల లోపే పవర్ అందుబాటులో కి వస్తుందన్నారు. ఉన్నవి లేనివి కల్పించి తప్పుడు వార్తలు రాసి ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరికాదన్నారు.

మన పవర్ ప్లాంట్‌లు మనకు ఉంటే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రావని గ్రహించిన సీఎం చెప్పిన విధంగానే దామరచర్ల,భద్రాద్రి ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారన్నారు.

సబ్ క్రిటికల్‌కు పోయి భద్రాద్రి ప్లాంట్ కడుతున్నారని వార్తలు రాశారని దేశంలో నిర్మించే 95 శాతం ప్లాంట్‌లు సబ్‌ క్రిటికల్ ప్లాంట్‌లే అన్నారు. ఇలాంటి నిరాదారమైన వార్తలు ప్రచురించి ప్రభుత్వ ప్రతిష్టను,విద్యుత్ సంస్థలను నిరుత్సాహపర్చడం సరికాదన్నారు. ఎన్టీపీసీ ఛైర్మన్,సీఎం కేసీఆర్ రామగుండం వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి వార్తలు రాస్తే ఏదో జరుగుతుందనుకోవడం వారి భ్రమే అవుతుందన్నారు.

- Advertisement -