బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలను ఈ నెల 8 నుంచి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధాన ఘట్టమైన అమ్మవారి కల్యాణం 9న అంగరంగ వైభవంగా నిర్వహించారు. నేడు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి హాజరయ్యారు.
హరీష్ రావుతో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కూడా అమ్మవారి కళ్యాణానికి హాజరయ్యారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్ రావు కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారంటూ ఓ పత్రికలో కథనం వచ్చింది.
పేపర్లో ఈ వార్త చూసిన హరీష్ రావు స్పందించారు. ఈ వార్త పూర్తిగా అవాస్తవం అన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి గారు నేల మీద నుంచి లేచి నిలబడేందుకు యత్నిస్తుండగా తాను సాయపడ్డానని తెలిపారు. దీన్ని తప్పుగా అర్ధం చేసుకుని పత్రిక మిత్రుడు ప్రచురించారు. ఈ వార్తను ఖండిస్తున్నానని..భవిష్యత్తులో ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు ఒకసారి ఆలోచించాలని కోరారు. ఇది చాలా బాధాకర విషయమన్నారు.
ఈ వార్తపూర్తిగాఅవాస్తవం.
గౌ.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగారు నేలమీది నుండి లేచినిలబడేందుకు ప్రయత్నిసుండగా సాయపడ్డాను. దీన్నితప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారు. ఈవార్తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదిబాధాకరం. భవిష్యత్ లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారణచేసుకుని ప్రచురించాలని కోరుతున్నా pic.twitter.com/L6WEf4lLPn— Harish Rao Thanneeru (@trsharish) July 10, 2019