- Advertisement -
సిద్ధిపేట స్టేడియంలో శనివారం రాత్రి సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ హైదరాబాదు యశోద హాస్పిటల్ వైద్యుల జట్ల మధ్య డే అండ్ నైట్ 20-20 క్రికెట్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జట్టుకు హరీశ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా ఆ టీమ్‌లో సీవీ ఆనంద్-ఐపీఎస్, ఏకే ఖాన్- రిటైర్డు-ఐపీఎస్, మైనార్టీ రెసిడెన్షియల్ చైర్మన్.సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఉన్నారు.
సిద్దిపేట క్రీడాభిమానులు, యువకులు, చిన్నారులు పెద్దసంఖ్యలో క్రికెట్ చూడడానికి వచ్చారు. మంత్రి హరీశ్‌రావు కృషితో సిద్దిపేటలో డే అండ్ నైట్ జరుగడం ఎంతో ఆనందంగా ఉందని, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతున్న ప్లేయర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
- Advertisement -