తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అగ్రగామిగా విరాజిల్లుతోందని ప్రముఖ క్రికేటర్ పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు అన్నారు. సాంకేతిక నిపుణతను వినియోగించుకోని పలు రంగాల్లో తెలంగాణ నెం 1 గా ఉంటోందని ఆయన కొనియాడారు. అగ్రగామిగా ఉంది కాబట్టే కేంద్రం తెలంగాణలోని పలు సంక్షేమ పథకాలను కేస్ స్టడీగా పరిశీలిస్తోందని సిద్ధు చెప్పారు. అగ్రగామిగా అందరికి ఆదర్శప్రాయంగా ఉండటం గొప్ప విషయం అని ఆయన అన్నారు.
జీపీయస్ ద్వారా వాహనల రవాణా వ్యవస్థను సమీక్షించడం కంప్యూటర్ ద్వారా అనుసంధానం చేసి సమాచారన్ని సేకరించడం గురించి ఆయన వివరిచారు. నీటి వినియోగంలో కూడా సాంకేతిక నిపుణతను వినియోగించి సమాచారాన్ని రూపొందించడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు. మొత్తానికి తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ది అనన్య సామాన్యమని ఆయన అన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ మెడల్‌ని పరిశీలిస్తున్నాయని కొన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయని అయన వివరించారు.