రాంచరణ్‌ నటన అద్భుతమన్న బాలీవుడ్ స్టార్ హీరో…

246
Vivek Oberoi compliments on Ram haran acting..
- Advertisement -

రాంచరణ్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం రంగస్థలం. ఇటీవల విడుదలై ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పుటికే కలెక్షన్ సూనామి సృష్టిస్తూ రికార్డులను దాటుకుంటూ వెళ్తోంది. ఈ సినిమాకు సంబంధించి చరణ్, సమంత నటనతో ఆకట్టుకున్నారని విమర్శకులు ప్రసంశలు కురిపిస్తున్నారు.

Vivek Oberoi compliments on Ram haran acting..

తాజాగా ఇదే దారిలో వచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ చెర్రీని పొగడ్తలతో ముంచె్త్తుతూ…‘‘చిట్టిబాబు సౌండ్ ఇంజినీర్! తమ్ముడు రామ్ చరణ్ నటన, రంగస్థలం సినిమాకు వచ్చిన భారీ, బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను చూస్తే చాలా సంతోషంగా ఉంది. చాలా బ్రిలియంట్ ట్రాన్స్‌ఫర్మేషన్! నువ్వు సూపర్ స్టార్, సూపర్ పెర్ఫార్మర్‌కి మెగా కాంబోవి. చాలా గర్వంగా ఉంది. గాడ్ బ్లెస్ యు! సూపర్ టాలెంటెడ్ టీమ్‌కి కంగ్రాట్స్ అంటూ వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశారు. బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా రాబోతున్న సినిమాలో వివేక్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -