హీరో సిద్ధార్థ్ కి తెలుగు తమిళ భాషల్లో మంచి క్రేజ్ వుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ రెండు భాషల్లోను ఆయనకి అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ రెండు భాషల్లోను తనే నిర్మాతగా .. హీరోగా ఆయన ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. ఆ మధ్య వచ్చిన తెలుగులో ‘మనం’ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ నటించిన సంగతి తెలిసిందే. అయితే హీరో సిద్ధార్థ్ ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ప్రస్తావించాడు.
తాజా ఇంటర్వ్యూలో సిద్దార్థ్ మాట్లాడుతూ .. ఈ కథ కోసం విక్రమ్ కుమార్ ముందుగా తననీ .. కె. విశ్వనాథ్ ను .. వెంకటేశ్ ను అనుకున్నారని చెప్పాడు. అయితే ఆ తరువాత ఆయన ఈ కథను అక్కినేని ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్లారని అన్నాడు. అందువలన ఈ సినిమాలో తాను చేయవలసిన పాత్రను మిస్సయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా వచ్చిన చాలాకాలం తరువాత సిద్ధార్థ్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించడమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.