- Advertisement -
తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పటికే చాలామంది హీరోల వారసులు వెండితెరకు పరిచయం అయ్యారు. వారిలో కొంతమంది సక్సెస్ కాగా మరికొంతమంది ఇంకా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక ఇటీవలె మహేష్ బాబు ఫ్యామిలీ నుండి గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా తాజాగా గల్లా జయదేవ్ – పద్మావతిల రెండో కొడుకు, గల్లా అశోక్ తమ్ముడు సిద్ధార్థ గల్లా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
Also Read:‘బ్రో’ థియేటర్లలో ‘భోళా శంకర్’!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తాడని, శ్రీలీలను హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైనట్టు తెలుస్తుంది.
- Advertisement -