‘లస్ట్ స్టోరీస్ 3’ పై సిద్ధార్థ్

1
- Advertisement -

కేవలం 90 రోజుల్లోనే పరస్పరం భిన్నమైన పాత్రలను పోషించే అవకాశాన్ని కల్పించిన నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు నటుడు సిద్ధార్థ్ కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధ కథాంశంతో వచ్చిన సీరీస్ ‘ఆపరేషన్ సేఫ్ద్ సాగర్’ , అలాగే ‘లస్ట్ స్టోరీస్ 3’ ప్రాజెక్ట్‌లపై స్పందిస్తూ.. “నాకు లభించే పనికి, ప్రజలు నాపై ఉంచే నమ్మకానికి నేను కృతజ్ఞుడిని. అజయ్ అహుజా మరియు బద్రూ పాత్రల మధ్య పెద్దగా తేడా లేదుఅ న్నారు.

ఎందుకంటే ‘అజయ్ అహుజా’ పాత్రను ఇచ్చిన దర్శకుడు నన్ను ఆ పాత్రలోకి ఒదిగిపోవాలని కోరుకున్నట్లే, విశాల్ భరద్వాజ్ గారు ‘బద్రూ’ పాత్రను ఇచ్చి నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాలని కోరుకున్నారు. కాబట్టి దర్శకులు మనపై ఉంచే నమ్మకం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది” అని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు.

‘ఆపరేషన్ సేఫ్ద్ సాగర్’లో పతకాలు సాధించిన యుద్ధ వీరుడు అజయ్ అహుజా పాత్రలో సిద్ధార్థ్ నటించగా, విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ‘లస్ట్ స్టోరీస్ 3’ విభాగంలో ఒక మహిళ ఊహల్లో నిలిచే ‘బద్రూ’ అనే పాత్రను పోషించారు. ‘లస్ట్ స్టోరీస్’ గురించి మాట్లాడూతూ.. మహిళల కోరికలు/కల్పనలను చర్చించే ఆలోచన చాలా “అభ్యుదయకరమైనది” అని నటుడు అన్నారు.

మహిళలు ఏమి కోరుకుంటున్నారో ఇది చెబుతుంది, అది చర్చించాల్సిన ఒక ముఖ్యమైన అంశం. కేవలం ఒకే పదంలో ‘టుడుమ్’ (Tudum) అని చెప్పేలా విభిన్నమైన పనులు దక్కే స్ట్రీమింగ్ యుగంలో మనం జీవిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను” అని ఆయన అన్నారు. ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారు, సృష్టికర్తలు (క్రియేటర్లు) ఏమి ఊహిస్తున్నారు మరియు ధైర్యంతో కూడిన నిర్ణయాలు తదుపరి రంగాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నాయి” అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో సిద్ధార్థ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సురేష్ త్రివేణి, ఫరా ఖాన్, నటుడు రితీష్ దేష్‌ముఖ్, రచయిత-షోరన్నర్ అభిజీత్ సింగ్ పర్మార్, మరియు నెట్‌‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కంటెంట్) మోనికా షేర్‌గిల్ కూడా పాల్గొన్నారు.

Also Read:‘గోల్డెన్ భాగ్యం’..ఫుల్ ఫన్‌ టైటిల్

- Advertisement -