నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ విడుదలపై క్లారిటీ..

134
- Advertisement -

న్యాచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ ఆడియన్స్‌లో సినిమా పట్ల మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తూ అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలను భారీగా పెంచేసింది.నానికి జోడీగా సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

అయితే ఈ సినిమా డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌కు భారీ డిమాండ్ ఉంద‌ని, ఓటీటీలో విడుద‌ల చేసేందుకు ఆయా సంస్థ‌లు భారీగా ఆఫర్‌ చేసినట్లు ప‌లు వెబ్‌సైట్లలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేగాక‌, ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ రూ.40 కోట్లు చెల్లించి విడుదల హక్కులు కొనుగోలు చేసిందని కూడా వార్తలు వ‌స్తుండ‌డంతో దీనిపై ఈ సినిమా నిర్మాతలు స్పందించారు.

ఈ వార్త‌ల‌న్నీ అవాస్తవాలేనని నిర్మాత‌లు స్ప‌ష్ట‌త నిచ్చారు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ విడుదల విషయంలో తాము ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని వారు చెప్పారు. కాగా, ఈ సినిమాలో నాని రింగుల జుట్టు, కోర మీసాలలతో విభిన్నమైన లుక్‌లో కన‌ప‌డుతుండ‌డం ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయినపల్లి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

- Advertisement -