న్యాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ చిత్రంతో నాని ఏ మేరకు ఆకట్టుకున్నారో చూద్దాం..
కథ:
వాసు (నాని) పెద్ద ఫిలిం డైరెక్టర్ కావాలని కలలుకంటుంటాడు. ఇందులో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ తీయగా అది పెద్ద సక్సెస్ అయి సినిమా అవకాశాలు వచ్చి పెద్ద దర్శకుడై పోతాడు. అయితే తాను తీసిన సినిమాను హిందీలోనూ డైరెక్ట్ చేసి కొన్ని లీగల్ సమస్యల్లో చిక్కుకుంటాడు. ఆ లీగల్ సమస్యలను ఎదుర్కొనే క్రమంలో వాసు దేవ్, శ్యామ్ సింగరాయ్ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయం బయటపడుతుంది.తర్వాత ఏం జరుగుతుంది… కీర్తి-వాసుల ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అన్నదే సినిమా కథ. .
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, నటీనటులు, క్లైమాక్స్. నాని తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలను అవలీలగా చేసేశాడు. వాసుగా శ్యామ్ సింగరాయ్‌గా దుమ్ము దులిపేశాడు. సాయి పల్లవి సినిమాకు మరో ప్లస్ పాయింట్. మైత్రేయిగా ఒదిగిపోయింది. కృతి శెట్టి అందం అభినయంతో మెప్పించింది. మిగితా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సన్నివేశాలు తేలిపోవడం, ముందే అంచనా వేసే కొన్ని సీన్స్.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. సినిమాటోగ్రాఫర్ సను జాన్ వర్గేసే పనితీరు సూపర్బ్. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. రెండో సినిమానే అయినా దర్శకుడు రాహుల్ అద్భుతంగా తీశాడు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
రచయిత జంగా సత్యదేవ్ రాసుకున్న కథకు విజువలైజేషన్ తో ప్రాణం పోశాడు దర్శకుడు రాహుల్. తాను చెప్పాలనుకున్న కథను ఎక్కడా తడబాటు లేకుండా చెప్పాడు. నాని, సాయి పల్లవి నటన, క్లైమాక్స్ సినిమాలో హైలైట్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గ చక్కటి చిత్రం నాని శ్యామ్ సింగరాయ్.
విడుదల తేదీ:21/12/2021
రేటింగ్:2.75/5
నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
దర్శకత్వం: రాహుల్ సాంకృత్యన్