మంత్రులను అవమానిస్తే తీవ్రపరిణామాలు: శ్రీనివాస్‌ గౌడ్

39
srinivas

మంత్రులను అవమానపర్చి ఢిల్లీ నుండి పంపితే భవిష్యత్‌లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌. మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్. మంచి చేస్తే దేశమంతా తిరిగి కేంద్రం మంచి చేసిందని చెబుతామని, చెడు చేస్తే దానికి తగ్గట్టే వ్యవహరిస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ మీద కోపంతో అధికార దాహంతో బీజేపీ తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు.

జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీ ల కోసం వెళతారు కానీ.. మేము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామంటూ మండిపడ్డారు. అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదని, తెలంగాణ నేతలను బీజేపీ బిచ్చగాళ్లుగా చూస్తోందని ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ బాధ్యత నుండి పూర్తిగా తప్పుకునే ప్రయత్నంలో కేంద్రం ఉందని ఆరోపించారు.