నవంబర్ 6న ‘శ్యామ్‌ సింగ‌రాయ్’ ఫస్టు సింగిల్..

132
- Advertisement -

క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో రూపొందుతోన్న నేచుర‌ల్‌స్టార్ నాని శ్యామ్‌సింగ‌రాయ్ ఇటీవ‌లి కాలంలో ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ నాని, ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ మ‌రియు నిర్మాత వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్‌. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 6వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్న విషయాన్ని అధికారిక పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు.

ఈ పోస్టర్ లో నాని లుక్ కూడా ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ అలరించనున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.

- Advertisement -