పుప్పరాజ్‌ వదిలిన ‘పుష్పక విమానం’ ట్రైలర్‌..

85
- Advertisement -

టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ, శాన్వీ మేఘన జంటగా దామోదర దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ సమర్పిస్తుండడం తెలిసిందే. విజయ్ మట్టపల్లి, గోవర్ధన్ రావు దేవరకొండ నిర్మాతలు. ఈ చిత్రం నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టయినర్ జానర్‌లో తెరకెక్కినట్టు చిత్రబృందం పేర్కొంది.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో అల్లు అర్జున్ ఈరోజు విడుదల చేశారు. ‘పుష్పక విమానం’ ట్రైలర్ లాంచ్ చేయడం సంతోషం కలిగిస్తోందని అల్లు అర్జున్ ట్విట్టర్‌లో వెల్లడించారు. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ సోదరుడు హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. తన తమ్ముడి చిత్రం ట్రైలర్‌ను అల్లు అర్జున్ ఆవిష్కరించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. “థాంక్యూ బన్నీ అన్నా” అంటూ ట్విట్టర్‌లో బదులిచ్చారు.

- Advertisement -