అవును… అతన్ని ప్రేమిస్తున్నా..?

342
Shweta Basu Prasad Confirms Relationship With Rohit Mittal
Shweta Basu Prasad Confirms Relationship With Rohit Mittal
- Advertisement -

శ్వేతాబసు ప్రసాద్. ఈ పేరు వింటే కొత్తబంగారులోకం చిత్రంలో ఎ…క్క…డా అంటూ ఆకట్టుకన్న స్వప్న పాత్ర గుర్తుకువస్తుంది. మొదటి సినిమాతోనే మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకుంది శ్వేతాబసు.కానీ, అనూహ్య ఘటనలు ఈ భామను అగాధంలోకి నెట్టివేశాయి. ఆ ఘటనల నుంచి బయట పడి ఈ మధ్యే ముంబైలో మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది శ్వేతాబసు.

shwetabasuprasad

ఆమె పరిస్థితి తెలుసుకుని ప్రముఖ హిందీ దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్, తన నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిల్మ్స్‌లో ఉద్యోగం ఇచ్చాడు. ఇదే క్రమంలో అక్కడ పనిచేసే అప్ కమింగ్ ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిట్టల్‌తో శ్వేతాకు పరిచయమైందని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమేనని శ్వేతాబసు ప్రకటించింది.

shwetabasuprasad

రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. వియ్ ఆర్ హ్యాపీ. ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ, చాలా స్మూత్‌గా మా పెళ్లి జరుగుతుందనే నమ్మకముంది.ఫాంటమ్ ఫిల్మ్స్‌లో రోహిత్‌ని కలిశాను. అప్పట్నుంచి మా ప్రయాణం మొదలైంది’’ అంటూ శ్వేతాబసు ప్రసాద్ చెప్పింది. ఇక వీళ్లిద్దరి ప్రేమకథలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించాడట. ప్రస్తుతం వరుణ్ ధావన్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ‘బద్రినాథ్ కి దుల్హనియా’తో పాటు ఓ హిందీ సీరియల్లోనూ శ్వేతబసు నటిస్తోంది.

https://www.youtube.com/watch?v=LcZLt7wI0x8

- Advertisement -