శ్వేతాబసు పరిచయం అక్కర్లేని పేరు.తెలుగు సినిమాల ద్వారానే హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత వ్యభిచారం కేసులో ఇరుక్కోవడం, కొంత కాలం పాటు పోరాడిన తర్వాత ఆ కేసు నుండి బయట పడటం అందరికీ తెలిసిందే.తొలి చిత్రం కొత్త బంగారులోకంతో మంచి టాలెంటెడ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న ఈ బెంగాలీ బ్యూటీ డేటింగ్ పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
అనూహ్య పరిణామాల నుంచి బయటపడ్డాక ముంబై వెళ్లిన శ్వేతకు ప్రముఖ హిందీ దర్శక, నిర్మాత అనురాగ్ కశ్యప్ తన సంస్థలో ఉద్యోగం ఇచ్చారు. ఈ క్రమంలో చిన్న చిత్రాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్ అనే వ్యక్తితో ప్రేమలో పడిందట శ్వేతా. కొన్నాళ్ళుగా వీరిద్దరు ముంబైలో చక్కర్లు కొడుతుండగా వీరి ప్రేమాయణం హాట్ టాపిక్‌గా మారింది.
శ్వేతా బసు ప్రస్తుతం ముంబైలోని ప్రొడక్షన్ హౌజ్‌లో స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా పని చేస్తూ అనేక డాక్యుమెంటరీలు రూపొందిస్తుందట. అయితే తాజాగా తన డేటింగ్ పై క్లారిటీ ఇచ్చింది. తాను రోహిత్ మిట్టల్ తో డేటింగ్ లో ఉన్న మాట నిజమే.రేండేళ్ళ నుండి రిలేషన్ షిప్ లో ఉన్నాం. పెళ్ళి గురించి ఇంకేమి ఆలోచించలేదు అని తెలిపింది.ఫాంటమ్ ఫిల్మ్స్ లో రోహిత్ ని కలిసినప్పటి నుంచి తమ ప్రయాణం మొదలైందని, వీరి ప్రేమకథలో అనురాగ్ కశ్యప్ కీలకంగా వ్యవహరించారని తెలిపింది.
ప్రస్తుతం హిందీ సినిమాలు, సీరియల్స్ లో అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. 11 ఏళ్ళ ప్రాయంలోనే హిందీ సినిమా మక్డీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన శ్వేతా నేషనల్ అవార్డులను అందుకుంది. ఇటు నటిగా అలరించిన ఈ భామ వేరే రంగంలోను రాణిస్తుండడం హర్షించ దగ్గ విషయం. అయితే ప్రస్తుతం లవ్ మేటర్ తో వార్తలలోకి ఎక్కిన శ్వేతా త్వరలో మూడు ముళ్ళు వేయించుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.