మరో 5 రోజుల పాటు వర్షాలు…

240
- Advertisement -

వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికే నాలుగు రోజులుగా సిటీ మొత్తం కుంభవృష్టి కురుస్తుంటే.. అది చాలదన్నట్లు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కదులుతోంది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో 4 రోజులు భారీ వర్ష సూచన ఉంది. రాయలసీమలో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మద్యలో ఒక్కరోజు పగటిపూట కాస్త తెరిపి ఇవ్వడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చి, తమకు కావల్సిన కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుక్కోగలిగారు. కొంచెం వెలుగు ముఖం చూశామని సంబరపడ్డారు. అయితే ఆ సంబరం ఎంతోసేపు నిలవలేదు. మళ్లీ రాత్రి నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

cyclone

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మరోసారి నగరంలో భారీ వర్షాలు తప్పకపోవచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా చెబుతోంది. మరోవైపు భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్మీ,ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలను రంగంలోకి దింపిన ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇక మంత్రులు సైతం తమ తమ జిల్లాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

rains in hyderabad

- Advertisement -