ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా జట్టను ప్రకటించింది బీసీసీఐ. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. వెస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసింది.
యువ ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్,నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేసింది. ఒకే ఒక స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇచ్చింది.
భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్‌కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
Also Read:Rahul:రాహుల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

