కాంగ్రెస్‌తో అభివృద్ధి శూన్యం:కోనప్ప

9
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో నాకు గౌరవం లేదు అన్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కార్యకర్తలతో మాట్లాడిన కోనప్ప… కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి అన్నారు. సిర్పూర్ నియోజకవర్గం మీద ప్రేమలేదు.. గ్రూప్ రాజకీయాలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టి కించపరచాలని చూస్తున్నారు అన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు రోడ్లు, వంతెనల కోసం కేసీఆర్ దగ్గర అడగగా అవన్నీ మంజూరు చేశారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులన్నింటినీ రద్దు చేసిందని విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కౌటాల మండలంలో వంతెన మంజూరు చేయాలని కోరానని, ఆయన దానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిపి తీరా టెండర్ను రద్దు చేశారని ఆరోపించారు.

సిర్పూర్ మండలం నాగమ్మ చెరువులో బుద్ధుని విగ్రహం చుట్టూ అభివృద్ధి చేసేందుకు రూ.4 కోట్లు మంజూరు చేస్తామని ఇప్పటివరకు దాన్ని ఊసే లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గూడెం వద్ద వంతెన నిర్మిస్తే అది ఇప్పుడు మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎంతో లాభదాయకంగా మారిందన్నారు.

Also Read:Rahul:రాహుల్ పై నాన్‌ బెయిలబుల్ వారెంట్

- Advertisement -