వకీల్ సాబ్‌తో శృతి రొమాన్స్‌..!

415
pawan
- Advertisement -

వకీల్‌సాబ్‌తో టాలీవుడ్‌కి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి ఇప్పటివరకు మంచి రెస్పాన్స్‌ రాగా తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. పవన్ సరసన శృతి హాసన్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారని టీటౌన్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.

గతంలో పవన్‌తో గబ్బర్‌ సింగ్‌లో హీరయిన్‌గా నటించి హిట్ కొట్టింది శృతి. తాజాగా మరోసారి పవన్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతం రవితేజతో క్రాక్‌ సినిమా చేస్తోంది శృతి. ఈ మూవీ తర్వాత పవన్‌ సినిమాలో జాయిన్‌ కానున్నట్లు సమాచారం. మొత్తం ఈ జోడి గబ్బర్ సింగ్‌ హిట్‌ను మళ్లీ రిపీట్ చేస్తుందా లేదా వేచిచూడాలి.

- Advertisement -