విజయ్‌తో శృతి రొమాన్స్‌..!

314
Shruti Haasan Vijay Sethupathi
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో చేరారు విజయ్ సేతుపతి.వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన విజయ్‌ ప్రస్తుతం టాలీవుడ్,కోలీవుడ్‌లలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో సినిమాకు సంతకం చేశాడు ఈ తమిళ సూపర్ స్టార్. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

గత కొంత కాలంగా తెలుగు, తమిళ చిత్రాలకు దూరంగా ఉంటున్న కథానాయిక శ్రుతి హాసన్ ..విజయ్ సేతుపతి సరసన హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్‌. ఈ సినిమా చేయడానికి శృతి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం లెడి గెటప్‌లో సూపర్ డీలక్స్‌ అనే సినిమా చేస్తున్నారు విజయ్‌. శిల్పగా ఈ సినిమాలో కనిపించనుండగా ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. రెడ్ కలర్ శారీలో.. బొట్టుపెట్టుకుని సాంప్రదాయబద్ధంగా.. అచ్చు అమ్మాయి మాదిరిగానే కనిపించాడు.

ఈ సినిమాతో పాటు మాధవన్- విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ‘విక్రమ్ వేద’తో టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -