గర్వంగా ఉంది.. తండ్రి ఓటమిపై శృతిహాసన్‌ స్పందన..

261
Shruti Haasan
- Advertisement -

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో నటుడు కమలహాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి పోటీ చేసిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరు సౌత్ నుంచి స్వయంగా బరిలోకి దిగిన కమలహాసన్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఫలితాలపై ఆయన కుమార్తె, సినీ హీరోయిన్‌ శృతిహాసన్‌ స్పందించారు. తన తండ్రిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటూ తన ట్విటర్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారు. దానికి ఎంఎన్‌ఎం ఎన్నికల చిహ్నమైన టార్చిలైటు చేతపట్టుకుని వున్న తన తండ్రి ఫొటోను ఆమె పోస్టు చేశారు.

- Advertisement -