శ్రుతి హాసన్ ప్రధాన పాత్రగా తమిళంలో ‘సంఘమిత్ర’ సినిమా తెరకెక్కుతోంది. 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమానికి సంబంధించిన ఫస్టు లుక్ పోస్టర్ ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లాంచ్ చేశారు.ఇక ‘సంఘమిత్ర’ అనే తమిళ్ సినిమా గురించి ఇప్పుడు అందరు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కేవలం మొదటి రోజున తన కొత్త సినిమా ”సంఘమిత్ర”ను అక్కడ లాంచింగ్ చేసుకోడానికే కాదు.. ఏకంగా కేన్స్ చలనచిత్రోత్సవం ముగింపు వరకు అక్కడే ఉండే తన సొగసులతో ఆ ఫ్రెంచ్ పట్టణాన్ని మరింత శోభాయానంగా తయారు చేసేస్తుంది కాబోలు మన శృతి హాసన్. అమ్మడు ఇప్పుడు అక్కడ తన సోకులతో రెచ్చిపోవడం చూస్తుంటే.. త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ కొట్టేసి ఇలాంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లో ఇక ఎల్లప్పుడూ భాగం అయిపోతుందేమో అనే సందేహం రాకతప్పదు.
మూడవ రోజు తన సత్తా చాటడానికి వాలెంటినో బ్రాండ్ డ్రస్సులో అలా మెరిసింది శృతి. బీభత్సమైన డీప్ వి-నెక్ డ్రస్సులో.. తన అవయవసిరిని ఎగసిపడేలా ప్రదర్శించేసింది అమ్మడు. ఆ క్లీవేజ్ సోకుల్లో ఎన్నో కెమెరా లెన్సులు మాత్రమే కాదు.. చూపరులు మనస్సులు కూడా కొట్టుకుపోయాయ్ అనే చెప్పాలి. పైగా అలాంటి డీప్ కట్ డ్రస్ వేసుకుని.. తనే స్వయంగా ఒక ఫోటో దిగేసి.. దానిని షేర్ చేసింది మన అమ్మడు. మొత్తానికి కేన్స్ రెడ్ కార్పెట్ ను భారీగా వాడేసుకోవాలని తొలిసారికే అమ్మడు వంటబట్టించేసుకుంది.ఏదేమైనా కూడా శృతికి ఈ గ్లామర్ షో అనేది కొత్త కాదు. అయితే ఈ గ్లామర్ కారణంగా ఆమెకు తనలో ఉన్న నటీమణిని బయటకు తీసే ఛాన్సులు మాత్రం రావట్లేదు.