రకుల్‌తో క్రికెట్‌ గాడ్‌..!

190
Rakul preet singh interviews sachin
Rakul preet singh interviews sachin
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్.. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను ఇంటర్వ్యూ చేసింది. రకుల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడమే కానీ.. ఇంటర్వ్యూ చేయడం కొత్తే.. క్రికెట్ గాడ్ సచిన్‌ కూడా రకుల్ వేసిన ప్రశ్నలకు కూల్‌గా సమాధానం చెప్పేశాడు. ఈ నెల 26న విడుదలవుతోన్న ఆ సినిమా కోసం రియల్‌ లైఫ్‌ అండ్‌ రీల్‌ లైఫ్‌ హీరో సచిన్‌ను ఇంటర్వ్యూ చేశానని ట్వీట్‌ చేశారామె.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన సచిన్ ను కలిసిన రకుల్.. అతడి జీవిత కథతో తెరకెక్కిన ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’. సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టెండూల్కర్.. దాన్ని అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో రకుల్ కు అతను ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి ఆ ఇంటర్వ్యూలో రకుల్ సచిన్ ను ఏం అడిగిందో.. అతను ఏం సమాధానాలు ఇచ్చాడో ఇంటర్వ్యూ టెలికాస్ట్‌ అయితే కానీ తెలియదు.

బ్రిటన్ దర్శకుడు జేమ్స్ ఎర్కిన్సన్ తెరకెక్కించిన ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ను సచిన్ మిత్రుడైన రవి భాగ్ చంద్ కా నిర్మించాడు. సచిన్ చిన్నప్పటి జీవిత విశేషాల్ని నటీనటుల అభినయంతో చూపించి.. మిగతా సినిమా అంతా సచిన్ కుటుంబ సభ్యుల వీడియోలు.. క్రికెట్ మ్యాచుల్లోని ఘట్టాలతో చూపించనున్నారు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

-sachin-biopic

ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుందా? అన్న ఆసక్తిని అటు క్రీడాభిమానులే కాదు.. సినిమా లవ్వర్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రత్యేక షోను ఇప్పటికే ప్రదర్శించారు. ఇండియన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆకాడమీలో ప్రత్యేక షోను ప్రదర్శించారు.ఈ సినిమా పూర్తి అయిన అనంతరం భావోద్వేగంతో కదిలిపోయి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వటం గమనార్హం. క్రికెట్ కు సచిన్ చేసిన సేవలకు గాను ఆయన్ను గౌరవంగా గ్రూప్ కెప్టెన్ స్థానాన్ని కల్పించి సముచితంగా గౌరవించటం తెలిసిందే.

- Advertisement -