రణబీర్‌తో ఎఫైర్‌…క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్‌

243
- Advertisement -

తెలుగు, తమిళంతోపాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ గుర్తింపు తెచ్చుకున్న విలక్షణనటుడు కమల్‌హాసన్‌.ఆయన వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి…తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్ అయినా యాక్టింగ్ అయినా తనకు నచ్చిన పంథాలో చేసుకుంటూ పోతూ ఉంది. ఈ అమ్మడు కోలీవుడ్‌, టాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌పైనే ఫోకస్‌ ఎక్కువగా పెట్టింది. తాజాగా ఈ భామ గురించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. కత్రినా కైఫ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన బాలీవుడ్‌ లవర్‌బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో శృతి ప్రేమలో పడిపోయాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

శ్రుతిహాసన్‌, రణ్‌బీర్‌ ఓ యాడ్‌ఫిల్మ్‌ కోసం కలిసి పనిచేశారు. ఈ సమయంలో షూటింగ్‌ పూర్తయ్యాక ఇద్దరు కలిసి డిన్నర్‌కి బయటికి వెళ్లేవారని, సన్నిహితంగా ఉండేవారని వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇచ్చిన శృతి…ఇలాంటి వార్తలు నాకు చాలా నవ్వు తెప్పిస్తుంటాయని చెప్పింది. అన్నీ అర్థంలేని మాటలు. అందులో ఎటువంటి నిజం లేదు. నేను నా వృత్తి జీవితంలో తీరికలేకుండా ఉన్నాను. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే.. ఈ రూమర్స్‌ నాపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని రణ్‌బీర్‌కు, తనకు మధ్య ఏమీలేదని శ్రుతిహాసన్‌ తేల్చి చెప్పారు.

Ranabir shruthi

- Advertisement -