దక్షిణాది సుందరి శృతి హాసన్ ఇప్పుడు ఫుల్ బిజీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటుంది శృతి. తాజాగా వచ్చే నెలలో రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడుతో.. తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది శృతి హాసన్. అటు సినిమాలతో బిజీగా గడుపుతూ.. బ్రాండ్ అండార్స్ మెంట్ ను పట్టేస్తూ తెగ బిజీగా ఉంటుంది ఈ భామ.
ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్ లో అంటూ అడుగు పెట్టాక అడుగడుగునా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. అందరికీ వచ్చినట్లే.. శృతి కి కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ అక్కడ పెద్దగా వినిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ తో ఎయిర్ పోర్టులో కనిపించింది. అతను లండన్ బేస్డ్ యాక్టర్ కావడం.. ప్రొఫెషన్స్ కలవడంతో ఈ మైకేల్ కోర్సలేను శృతి హాసన్ లవర్ అంటూ వీరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని అన్వయించేశారు మీడియా జనాలు. శృతి హాసన్ సహజంగా ఇలాంటి రూమర్స్ పై స్పందించదు.
కానీ.. ఈసారి మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. మైకేల్ కు తనకు మధ్య ఏమీ లేదని మైకు పట్టుకుని మరీ అరిచి చెప్పేసింది. జస్ట్ తామిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని ఓ పెద్ద క్లారిటీ కూడా ఇచ్చేసింది శృతి హాసన్.. తనకు ఎవరితోనూ అలాంటి రిలేషన్స్ లేవని పూర్తిగా చెప్పేసింది. దీంతో మైకేల్ తో ఈమె చెట్టాపట్టాల సంగతి అంతా జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.