డీజే కి, గబ్బర్‌సింగ్‌ కి ఉన్న లెక్కేంటి..?

211
Allu Arjun Gets Pawan Kalyan Number
- Advertisement -

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే-దువ్వాడ జగన్నాధం ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే సాంప్రదాయ బ్రాహ్మణుడి గెటప్ లో ఉన్న బన్నీ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇన్నాళ్ళూ స్టైలిష్‌ గా కనిపించిన బన్నీ ఈ లుక్ లో అదిరిపోయెలా కనిపిస్తున్నాడు. ఇందులో ఓ బజాజ్ స్కూటర్ నడుపుకుంటూ వస్తుట్టు బన్నీ మనకు కనిపిస్తాడు. ఇప్పుడీ సినిమాకి.. పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్ కు ఓ పోలిక పెట్టేస్తున్నారు నెటిజన్లు.

డీజేలో బన్నీ నడుపుతున్న స్కూటర్ నెంబర్ ఏపీ 16ఈఏ 2425. ఈ నెంబర్ దగ్గరే కంపేరిజన్ చేస్తున్నారు నెటిజన్లు. గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ బైక్ నడుపతూ కనిపిస్తాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ వాడే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నెంబర్ ఏపీ 27జీఎస్ 2425. ఇప్పుడు బన్నీ కూడా ఇదే 2425 నెంబర్ ను ఉపయోగించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఇప్పటికే బన్నీ వర్సెస్ పవన్ అంటూ రకరకాల కామెంట్స్ వినిపిస్తున్న ఈ నేపథ్యంలో ఇలా పవన్ బైక్ నెంబర్ ను.. బన్నీ స్కూటర్ కి ఉపయోగించడం కొంచెం విడ్డూరంగానే అనిపిస్తోంది.

 Allu Arjun Gets Pawan Kalyan Number

అయితే.. గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించింది, డీజేను తెరకెక్కిస్తోంది ఒకే దర్శకుడు. ఈ రెండు సినిమాలకు దర్శకుడు ఒక్కడే అనే విషయం మర్చిపోకూడదు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఉద్దేశ్యపూర్వకంగానే పవన్ బైక్ కి ఉపయోగించిన నెంబర్ నే ఈ స్టైలిష్‌ స్టార్‌ స్కూటర్ కి కూడా వాడాడనే టాక్ వినిపిస్తోంది. మరి గబ్బర్ సింగ్ సినిమాలో డీజే సినిమాలో ఒకే నెంబర్‌ కలిగిన వాహనాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ కావాలనే ఉపయోగించుకుంటే…దానికీ ఓ లెక్కుంటుందేమో మరి..!

- Advertisement -