డేటింగ్‌ నుంచి వెడ్డింగ్‌ దాకా…?

232
- Advertisement -

హాట్‌ బ్యూటీ శ్రుతి హాసన్ లండన్ కి చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. శ్రుతి.. మైఖేల్‌లు ముంబయిలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి కూడా వేరే చెప్పనక్కర్లేదు.

Shruti Haasan is Ready to get Married

అయితే ..వీరి లవ్వాయనంపై  పలుమార్లు మీడియాలో వార్తలు రాగా, అవన్నీ రూమర్లు అంటూ ఈ ముద్దుగుమ్మ కొట్టిపడేసింది. కానీ ఇది రూమర్ కాదని, సీరియస్ రిలేషన్ షిప్ అని తెలుస్తోంది. తాజాగా ఆమె తన తల్లి సారికకు మైఖెల్‌ను పరిచయం చేసింది. ఈ సందర్భంగా మైఖేల్‌, శ్రుతి, సారిక కలిసి దిగిన ఫొటోలు కొన్ని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  Shruti Haasan is Ready to get Marriedఅయితే వీరి పెళ్లికి సారిక నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, అంతేకాకుండా శ్రుతికి టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా పెద్దగా సినిమాలు కూడా లేకపోవడంతో పెళ్లికి రేడీ అవుతోందని టాక్‌.

కాగా ఈ విషయాన్ని శ్రుతి ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా..ఇక మైఖేల్‌, శ్రుతి,కి మిగిలింది వివాహమేనని కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. ఏదేమైనా..ఇంత దూరమొచ్చాక..  శృతి ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

- Advertisement -