ఇరకాటంలో శృతిహాసన్..

828
sruthi hasan
sruthi hasan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’. డాలీ దర్శకుడు. రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇందులో పవన్ ఫ్యాక్షనిస్టు లీడర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ జతకట్టనుంది. గతంలో ‘గబ్బర్ సింగ్’లో పవన్ తో ఆడిపాడింది శృతి. ప్రస్తుతం శృతి ఫుల్ బిజీ.. అయినా పవన్ కోసం అతికష్టం మీద కాల్షీట్లని ఇచ్చింది.

Shruti Haasan In Pawan Kalyan Katama Rayudu

మామూలుగా ఓ స్టార్ హీరో సినిమా అంటే.. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తారు అభిమానులు. ఐతే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆయన సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అని చూస్తారు ఫ్యాన్స్. పవన్ లాస్ట్ మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో ఎంత జాప్యం జరిగిందో తెలిసిందే. లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’ ముహూర్తం జరుపుకుని మూడు నెలలు దాటింది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ విషయంలో అనుకున్న డేట్లు రెండు మూడు దాటిపోయాయి. ఎట్టకేలకు ఈ నెల 24 నుంచి సినిమా నిజంగానే సెట్స్ మీదికి వెళ్లిపోతుందని అంటున్నారు.

Shruti Haasan

ఈ నేపథ్యంలో ‘కాటమరాయుడు’ గురించి ఓ కొత్త అప్ డేట్ వచ్చింది. పవన్ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకొన్నట్టు సమాచారమ్. పవన్ సరసన అవకాశం అనగానే శృతి కూడా కొన్ని సినిమాలను వదులుకుని మరీ డేట్స్ ఇచ్చింది. అయితే, ఇప్పటి వరకు శృతి పాల్గొనాల్సిన షెడ్యూల్ ప్రారంభం కాలేదు. ఇప్పటికే శృతీ హాసన్ ఇచ్చిన డేట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయట. దీంతో పవన్ సినిమా మరీ ఆలస్యం అయ్యేలా ఉంటే మాత్రం తాను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వస్తుందని దర్శక-నిర్మాతలకి శృతి స్పష్టం చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.

Shruti Haasan

అయితే ఈ సినిమాలో శృతితో పాటు మరో హీరోయిన్‌ కూడా ఉన్న ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యామినీ భాస్కర్ అనే కొత్తమ్మాయి కీలక పాత్ర పోషిస్తోందట. యామిని ఇంతకముందు ‘కీచక’ అనే సినిమాలో హీరోయిన్ పాత్ర చేసింది. అలాగే ‘రభస’లో ఓ చిన్న క్యారెక్టర్ చేసింది. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అనగానే ఉబ్బితబ్బిబ్బయిపోతోంది యామిని.

ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు గానీ.. పవన్ సరసన శృతి అయితేనే బాగుంటుందని.. ఆమెని వదులుకోవద్దని కోరుతున్నారు పవన్ అభిమానులు.

- Advertisement -