ప్రవాసి బతుకమ్మ… ప్రవాసి స్త్రీ శక్తి పురస్కారాలు

196
pravasimitra-ATA
- Advertisement -

ఏ దేశమేగినా…ఎందుకాలిడినా…మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే ఉన్నాం…తెలంగాణ నుంచి గల్ఫ్ వయా యూరప్…అమెరికా దాకా మనవాళ్లు ఎక్కడున్నా..మన కట్టుబొట్టు తీరును మరువలేదు. వంటకాల రుచిని విడువలేదు. మన ఆచార వ్యవహారాలను ఆపలేదు. అలాగే మన పండుగపబ్బాలను మానలేదు. ఉన్నచోటునే సొంతూరు అనుకొని ఉన్నవాళ్లనే అయిన వాళ్లుగా చేసుకొని సంబురాలు చేసుకుంటున్నాం…సంతోషాలను పంచుకుంటున్నాం.

అయితే ఈ యేడు బతుకమ్మ వేడుకన ప్రవాసి పచ్చికతో పాటు మన తెలంగాణ వాకిట్లో కూడా పేరుస్తున్నాం…దీనికి అలుకు జల్లి ముగ్గేసి బతుకమ్మ సిబ్బిని పెడ్తున్నది…అమెరికన్ తెలంగాణ అసోసియేషన్. ఈ ఆటాపాటకు చేయి,గొంతు కులుపుతున్నది ప్రవాసి మిత్ర.

Pravasi Bathukamma
Pravasi Bathukamma

బతుకమ్మ..స్త్రీ శక్తికి ప్రతీక. అందుకే ఈ ప్రవాసీ బతుకమ్మను ఆటపాటలతోనే సాగనంపక..దేశం నలుమూలల నుంచి ప్రపంచ మూలలకు వెళ్లి…అక్కడ ఓ వైపు జీవనపోరాటం సాగిస్తూనే మరోవైపు తమదైన ప్రత్యేకతను చూపి…భారతీయ స్త్రీ ప్రతిభాపాటవాలను చాటి శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్న మన ఆడబిడ్డలను ప్రవాసి స్త్రీ శక్తి అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్నీ ప్రారంభించబోతోంది. అలా బంగారు బుతకమ్మను సాదరంగా సాగనంపుతోంది.

ఇది తొలి అడుగే…సుదీర్ఘ ప్రయాణంగా సాగాలంటే మీ అడుగులు పడాలి..ఈ కార్యక్రానికి రావాలి.. విజయవంతం చేయాలి..ప్రవాసి బతుకమ్మ ఆటపాటలో మీ చప్పట్లు…లయ..మీ స్వరాల శృతి కలవాలి. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న ప్రవాసి తెలంగాణ,ప్రవాసి భారతీయ సమాజాన్ని ఒకే వేదికపూకి తీసుకురావాడానికి ప్రవాసిబతుకమ్మ పండుగ ఒక సాంస్కృతిక దౌత్యంగా ఉపయోగపడాలని అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ కొండా తెలిపారు.

pravasimitra
pravasimitra

అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మరియు ప్రవాసి మిత్ర ఆధ్వర్యంలో అక్టోబర్ 2న హైదరాబాద్‌లో ప్రవాసి బతుకమ్మ పండుగ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన 10 మంది ఎన్నారై/పీఐవో(ప్రవాస భారతీయ/భారత సంతతి) మహిళలను ఈ సందర్భంగా ప్రవాసి స్త్రీ శక్తి అవార్డులతో సత్కరిస్తామని తెలిపారు.

హైదరాబాద్ బేగంపేటలోని జీవన్ జ్యోతి క్యాంపస్,చికోటి గార్డెన్స్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ప్రవాసి బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలని…ఎన్నారైలు, వారి కుటుంబసభ్యులు,శ్రేయోభిలాషులు అందరూ పాల్గొనాలన్నారు. వివరాలకు అమెరికా వాట్సాప్‌ నెం +14124984809..ఇండియా వాట్సాప్ నెం +91 9849422622కు సంప్రదించవచ్చు.

- Advertisement -