ప్రియుడితో శ్రుతిహాసన్ లిప్‌ లాక్‌.. ఫోటో వైరల్..

23
Shruti Haasan

తెలుగు, తమిళ చిత్రాలతో పాటు ఉత్తరాదిన కూడా హీరోయిన్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ శ్రుతిహాసన్‌. ఈ అమ్మడు ఆ మధ్య మైకేల్‌ కొర్లేతో ప్రేమలో పడింది. కొంతకాలానికి అతనితో బ్రేక్‌ తీసుకుంది. ఆతర్వాత మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టి హీరోయిన్‌గా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది శ్రుతి. అయితే బ్రేకప్‌ బాధ నుంచి బయటపడిన ఈ చెన్నై సోయగం ఇప్పుడు డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హాజారికతో ప్రేమలో మునిగి తేలుతుంది. తాజాగా ఓ బహిరంగ మార్కెట్లో షాపింగ్ చేస్తూ శంతనును ఘాడంగా హత్తుకుని డీప్ లిప్ లాక్ వేస్తున్న ఫోటోగ్రాఫ్ ని శ్రుతి సోషల్ మీడియాల్లో షేర్ చేసింది.

ఆ ఇద్దరూ మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. రిటైల్ దుకాణంలో ఆ ఇద్దరూ అలా చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫోటోని ఇలా షేర్ చేయగానే అలా అంతర్జాలంలో వైరల్ గా మారింది. గత కొంతకాలంగా కొత్త బోయ్ ఫ్రెండ్ శంతను హజారికా లోకంలోనే జీవిస్తున్న శ్రుతి ఎప్పటికప్పుడు అతడితో సెల్ఫీలను షేర్ చేస్తుంటే అవన్నీ వైరల్ గా మారుతున్నాయి. ఈ అందాల భామ అతడి సాంగత్యంలో అన్నిటినీ మైమరిచిపోతోంది. శ్రుతి ప్రస్తుతం ప్రభాస్‌ సలార్ సినిమాలో నటిస్తోంది.