చిరుతో కమల్‌ డాటర్ రొమాన్స్‌..!

442
chiru shruthi hassan
- Advertisement -

వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కొరటాల శివ తన నెక్ట్స్ ప్రాజెక్టును మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్న చిరు ఈ సినిమా పూర్తికాగానే కొరటాల మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న కొరటాల పాత్రలో ఎంపికను పూర్తిచేస్తున్నారట.ఈ సినిమాలో చిరు సరసన శృతిహాసన్‌ను హీరోయిన్‌గా తీసుకోబోతున్నారని ఫిల్మ్‌ నగర్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.గతంలో కొరటాల-మహేష్ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్‌గా మెప్పించింది శృతి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో చిరుతో మూవీలో ఇదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నారట కొరటాల.

ఇక ఆగస్టులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. పవన్‌తో కాటమరాయుడు సినిమా తర్వాత తెలుగులో మరే సినిమా చేయలేదు శృతి. తాజాగా మెగాస్టార్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

- Advertisement -