శ్రుతి హాసన్ సీక్రెట్ గా జపాన్ వెళ్లిందని తెలుస్తుంది. సౌత్ ఆడియన్స్ అంతా కూడా ఎక్కువగా ఇష్టపడే హీరోయిన్స్ లో శ్రుతి హాసన్ కూడా ఒకరు. తెలుగులో అయితే ఆమెను స్టార్ బ్యూటీ అనే ట్యాగ్ లైన్ ఇచ్చి మరీ పిలుస్తారు. ఎంచుకునే పాత్రలకు శ్రుతి హాసన్ చూపించే అభినయం ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. సలార్ సినిమాలో నటించిన శ్రుతి హాసన్ ఆ తర్వాత తెలుగులో గ్యాప్ తీసుకుంది. ఈమధ్యనే ఓ సినిమాను సైన్ చేసింది. అలాగే మెగాస్టార్ సినిమాలో కూడా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ రోల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు.
ఐతే, తాజాగా శ్రుతి హాసన్ జపాన్ వెళ్లిందని తెలుస్తుంది. ఇంతకీ శ్రుతి హాసన్ జపాన్ ఎందుకెళ్లింది అని ఆరా తీస్తే బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసమని తెలుస్తుంది. శ్రుతి హాసన్ ఓ హిందీ సినిమాకు సైన్ చేసింది. షాహిద్ కపూర్ హీరోగా ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాని యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తైందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకే శ్రుతి హాసన్ జపాన్ వెళ్లిందట. జపాన్ లో ఇప్పటివరకు ఏ సినిమా షూటింగ్ కూడా చేయని సప్పోరో ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుందట.
తెలుగుతో పాటుగా శ్రుతి హాసన్ హిందీలో కూడా బిజీ అవ్వాలని చూస్తుంది. షాహిద్ కపూర్ ఈ సినిమాని దగ్గర ఉండి చూసుకుంటున్నారని తెలుస్తుంది. మరి షాహిద్ కపూర్ నటిస్తున్నాడు అంటే కచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉండే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఏ సినిమా షూట్ చేయని ప్లేస్ లో సినిమా షూట్ చేస్తున్నారు అంటే సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తుంది. మొత్తానికి శ్రుతి హాసన్ కి మంచి సినిమానే దొరికింది.
Also Read:INDvsENG :ఇంగ్లాండ్ చరిత్ర తిరగరాస్తుందా?