విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా వెండితెరకు ఆరంగేట్రం చేసిన బ్యూటీ శృతి హాసన్. తెలుగు,తమిళ్,కన్నడలో పలు సినిమాల్లో నటించిన శృతి కెరీర్ గబ్బర్ సింగ్ మూవీతో మారిపోయింది. కెరీర్ ప్రారంభంలో ఐరెన్ లెగ్గా ముద్రపడిన ఈ అమ్మడు సినీకెరీర్ని గబ్బర్ సింగ్ మార్చేసింది,
ఈ మూవీ హిట్ కావడంతో వరుస ఆఫర్లు క్యూకట్టాయి. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ మూవీ చేస్తోంది శృతి. అయితే కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడగా సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
మహేశ్ బాబు జెంటిల్ మన్… పర్ఫెక్ట్ జెంటిల్ మెన్ అని కితాబిచ్చిన శృతి…బన్నీ మంచి వ్యక్తి…అతడితో నటించడం సూపర్బ్ అని చెప్పుకొచ్చింది. ఇక రవితేజతో నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అని …ఆయన సెట్స్‌లో ఉంటే నవ్వులు పూయిస్తారని తెలిపింది.చివరగా ఎన్టీఆర్ వెరీ నైస్ పర్సన్ తెలిపింది శృతిహాసన్.
పవన్ కళ్యాణ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అమేజింగ్ నటుడని చెప్పిన శృతి…తన ఫెవరెట్ హీరో కమల్‌హాసన్ అని వెల్లడించింది. తనకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టమని తెలిపింది శృతి.