హాట్ బ్యూటీ శ్రుతి హాసన్ లండన్ కి చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలిసి ముంబై వీధుల్లో కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోలు వైరల్ కావడంతో వీరి ఎఫైర్ డేటింగ్ నుండి వెడ్డింగ్ వరకు వచ్చిందని అంతా భావించారు. కానీ వీరిద్దరూ ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు.
ఈ విషయాన్నిఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టం చేశారు మైఖెల్ . జీవితం మమ్మల్నిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తోందని తెలిపారు. కానీ ఈ యంగ్ లేడీ ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్‌గానే మిగిలిపోతుందని ఇందుకు గొప్పగా పీలవుతున్నానని శృతితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు మైఖేల్.
ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, పరస్పరం చర్చించుకుని స్నేహపూర్వకంగానే విడిపోయారని సన్నిహిత వర్గాల సమాచారం. 2016లో శృతి ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మైఖెల్‌ని కలిశారు. తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా భావించారు. కానీ అనుకోకుండా వీరి ఎఫైర్‌కి బ్రేకప్ పడింది.