శ్రియ గట్టిగానే ట్రై చేస్తోంది..

192
- Advertisement -

హీరోయిన్‌ అన్నాక కుదురుగా కూర్చుంటే ఎలా? ఒక సినిమా ఐపోగానే మరో సినిమా కోసం ట్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడున్న వారంతా అదే పనిలో ఉంటారనుకోండి. కానీ ఆఫర్లు చేజిక్కించుకోవాలంటే..తెగ కష్టపడాల్సిందే. అది కూడా బడా హీరోల మూవీలో అయితే..? ఏ రేంజ్‌ లో ట్రై చేస్తుండాలో వేరే చెప్పనక్కర్లేదు.

అయితే ఇప్పుడొచ్చే లేటెస్ట్‌ హీరోయిన్స్‌కి ఆఫర్లు రావడం కష్టంగా తయారయింది. అలాంటిది సీనియర్‌ భామలు పెద్ద సినిమాలలో హీరోయిన్‌ గా ఛాన్స్‌ లు కొట్టేయడం మాత్రం పెద్ద సవాలే. అయితే ఇప్పుడు ఇదే సవాల్‌ ని ఎదుర్కుంటోంది సీనియర్‌ బ్యూటీ శ్రియ శరణ్‌.
 shriya wnats to romance chiru in Uyyalawada Movie
ఈ అమ్మడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆల్మోస్ట్ ఫేడవుట్ అయ్యే టైంలో ‘శాతకర్ణి’ సినిమాలో బాలకృష్ణతో జతకట్టే ఛాన్స్‌ కొట్టేసింది. వశిష్టదేవిగా రాయల్ లుక్‌లో కనిపించిన శ్రియ మంచి మార్కులనే సంపాధించుకుంది.  ఇక ఈ సినిమా హిట్ రావడంతో పూరీ కన్ను శ్రియ మీద పడింది. దానికి బాలయ్య కూడా ఓకే అనేశాడు. దాంతో పూరీ చేస్తున్నకొత్త ప్రాజెక్ట్‌లో శ్రియని రిపీట్ చేస్తున్నాడు బాలయ్య.

ఇదిలావుండగా శ్రియ కన్ను ఇప్పుడు మళ్ళీ మెగా కాంపౌండ్‌ పై పడింది. మెగా హీరోతో మరోసారి రొమాన్స్‌ చేయాలని డిసైడైంది. అందుకే సమయన్ని బట్టి మెగా మూవీ కోసం గాలం వేసే పనిలోపడింది ఈ అమ్మడు. చిరంజీవి 151వ ఫిల్మ్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో లీడ్‌రోల్ కోసం శ్రియ ట్రై చేస్తోందని టాక్. ఇప్పటికే ఐశ్వర్యారాయ్, విద్యాబాలన్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ శ్రియ గట్టి ప్రయత్నాలే చేస్తుందట.
 shriya wnats to romance chiru in Uyyalawada Movie
అయితే ఇప్పటికే చారిత్రక నేపథ్యంలో ఉండే సినిమాలను చేసిన శ్రియ , ఉయ్యాలవాడ చారిత్రక నేపథ్యం కావడంతో తనకే హీరోయిన్ ఛాన్స్‌ వస్తుందని ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటోందట. ఇప్పటికే చిరూతో ‘ఠాగూర్‌’లో రొమాన్స్‌ చేసింది ఈ అమ్మడు. మరి ఇప్పుడు శ్రియ గాలానికి  ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పడతాడో..లేదో చూడాలి.

- Advertisement -