పదహరేళ్ల క్రితం 2001లో ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రేయ.. నటిగానే కాకుండా ఉంటే డాన్సర్ గా కూడా నిరూపించుకుంది. సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే సినిమాల ఘన విజయాలు ఆమె కెరీర్ కు పూలబాట వేశాయి. గ్లామర్ పాత్రలే కాక పవిత్ర వంటి నటనకు స్కోప్ ఉన్న కేరక్టర్లూ వేసింది శ్రేయ. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లోనే కాక, ఇంగ్లీష్, కన్నడ చిత్రాల్లో కూడా శ్రేయ నటించింది. అజయ్ దేవగన్ తో దృశ్యంలోనూ, నాగార్జునతో ఊపిరి, మనంలోనూ నటనకు ప్రాధాన్యమున్న కేరక్టర్స్ ను శ్రేయ చేసింది. ఇప్పటికీ తన ఫిట్‌నెస్‌తో నేటితరం హీరోయిన్లకు పోటీనంటోంది.
తాజాగా శ్రేయ ఇప్పుడు బాలకృష్ణ 101వ మూవీ పైసా వసూల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లో బాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గోంటోంది శ్రేయ. ఈ సంధర్బంగా శ్రేయ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఈ సంధర్బంగా తాను పెళ్ళికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది. నచ్చినవాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భర్త అన్ని విషయాల్లో ఓ స్నేహితుడి వలె తనకు అండదండగా ఉండాలని చెప్పుకొచ్చింది శ్రేయా. అంతేగాక స్త్రీ జీవితంలో పెళ్లి, పిల్లలు అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవని చెప్పుకొచ్చింది శ్రేయ.