ఎంగేజ్‌మెంట్ కు ముందే అలా చేశాడు..అందుకే…

201
Shriya Bhupal Talk About Akhil Akkineni..
- Advertisement -

గత రెండు, మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో రోజుకో కొత్త టాపిక్ తో అఖిల్‌ పెళ్ళి క్యాన్సిల్ అయిన విషయాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అక్కినేని న‌వ‌మ‌న్మ‌థుడు అఖిల్ – ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జీ.వీ.కే. రెడ్డి మ‌నుమ‌రాలు శ్రియా భూపాల్ పెళ్లి బ్రేక‌ప్ అయింద‌న్న వార్త ఎక్క‌డ చూసినా జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అయితే కొద్ది రోజుల క్రిత‌మే వీరి ఎంగేజ్‌మెంట్ అతిర‌ధ‌మ‌హార‌థుల స‌మ‌క్షంలో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది.

త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లిపీట‌లు ఎక్క‌డం ఖాయ‌మ‌నుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పిడుగులాంటి వార్త బ‌య‌ట‌కు బయటపడింది. అఖిల్‌-శ్రియ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో పూడ్చ‌లేని విధంగా అగాధం ఏర్ప‌డింద‌ని, వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందన్న వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. రోమ్‌లో జ‌రిగే వీరి పెళ్లికి హాజరవడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్న‌వారందరికి, వాటిని క్యాన్సిల్ చేసుకోవాల‌న్న వర్త‌మానం అంద‌డంతో ఈ మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.  ఇక అంగరంగవైభవంగా వివాహం చేసుకోవాలనుకున్న వీరి పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ అయింది అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

సుబ్బ‌రామిరెడ్డి మ‌న‌మ‌డు పెళ్లిలో వీరి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నా…నిజానికి అంత‌కు ముందు నుంచే అఖిల్‌-శ్రియ ల మ‌ధ్య గ్యాప్ స్టార్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. రోమ్‌లో పెళ్లి ప‌నులు ప‌ర్య‌వేక్షించేందుకు వెళుతున్న టైంలో అఖిల్‌–శ్రియ ఎయిర్‌పోర్టులో గొడవపడ్డారని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. మరి త్వరలో పెళ్ళిపీఠలు ఎక్కాల్సిన వీరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయో ఎందుకొచ్చాయో గానీ, శ్రియా మాత్రం అఖిల్‌ ప్రవర్తన వల్లే ఇలా జరుగుతుతోంది అంటుందట.

గ‌త మూడేళ్లుగా ఎంతో ఇష్టంగా తాను అఖిల్‌ను ప్రేమిస్తున్నా…త‌న‌తో మాత్రం స‌రిగ్గా స్పెండ్ చేయ‌డం లేద‌ని పెద్ద‌ల‌తో చెప్పింద‌ట‌ శ్రియా. అయితే  ఎంగేజ్‌మెంట్ ముందే తనతో అలా ప్రవర్తించిన అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌ త‌ర్వాత కూడా త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆమె ఫీల్ అయిన‌ట్టు స‌మాచారం. ఇక ఈ గ్యాప్ పెద్ద‌దిగా మారి చివ‌ర‌కు ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ మాటా మాటా అనుకొని… ఇటలీకి పెళ్లికి వెళ్లాల్సిన అఖిల్‌ గోవాకీ, శ్రియ అమెరికాకీ చెక్కేశారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -