శ్రీయాభూపాల్ గుర్తుందా..? అదేనండీ అక్కినేని అఖిల్ మాజీ లవర్, జీవీకే గ్రాండ్ డాటర్. అఖిల్, శ్రీయభూపాల్ లవ్వాయణం గురించి తెలిసిందే. జీవీకే గ్రాండ్ డాటర్ గా అందరికీ పెద్దగా తెలియకపోయినా..అఖిల్ లవర్ గా మాత్రం పాపులర్ అయింది.
ఇక అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టబోతోందన్న వార్తలతో శ్రీయా భూపాల్ పేరు మారుమోగింది. ఇదంతా బాగానే ఉన్నా… వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం నుంచి మ్యారేజ్ వరకు వెళ్ళారు. కారణమేంటో గానీ..మధ్యలోనే వీరి పెళ్ళి కాన్సిల్ అయిపోయింది. దీంతో వీరి పెళ్ళి కాన్సిల్ అవడానికి కారణమేంటని సోషల్ మీడియాలో జోరుగానే వార్తలొచ్చాయి.
కట్ చేస్తే….సోషల్ మీడియాలో శ్రీయాభూపాల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రీసెంట్‌గా అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్ళిపై శ్రీయా కామెంట్ చేసింది. వీరికి మ్యారేజ్ విస్సెస్ చెప్తూ చైతూ,సామ్ కలిసి దిగిన ఫోటోని తన ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అయితే ఇప్పుడు శ్రీయా చేసిన పోస్టే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎందుకంటే..అఖిల్ తో పెళ్ళి కాన్సిల్ అయినప్పటినుంచి ఇప్పటి వరకూ రియాక్ట్ అవని శ్రీయా ఇప్పుడు సడన్ ఇలా పోస్ట్ పెట్టేసరికి మళ్ళీ అక్కినేని ఫ్యామిలీకి దగ్గరవ్వాలని ట్రై చేస్తోందా? అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి.
నిజానికి అఖిల్, చైతూల పెళ్ళిని ఒకేసారి జరిపించాలని నాగార్జున అనుకున్నారు. ఒకవేళ నాగ్ అనుకున్నట్టు గానే జరిగుంటే మాత్రం అఖిల్,శ్రీయాల జంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేది.