శ్రేయస్ మోత..

192
Shreyas Iyer’s 96 helps Delhi Daredevils pip Gujarat Lions
Shreyas Iyer’s 96 helps Delhi Daredevils pip Gujarat Lions
- Advertisement -

ఐపీఎల్ 10లో బాగంగా బుదవారం జరిగిన మ్యాచ్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పోరాటపటిమను ప్రదర్శించడంతో నామమాత్రమైన మ్యాచ్‌లో దిల్లీ 2 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌పై గెలిచింది. శ్రేయస్(‌96; 57 బంతుల్లో 15×4, 2×6) తో పాటు కరుణ్‌ నాయర్‌ (30; 15 బంతుల్లో 5×4, 1×6), కమిన్స్‌ (24; 13 బంతుల్లో 2×4, 1×6) రాణించడంతో లక్ష్యాన్ని దిల్లీ 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

196 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన దిల్లీ రెండు ఓవర్లయినా కాకముందే శాంసన్‌ (10), పంత్‌ (4)లను కోల్పోయింది. శాంసన్‌ను సంగ్వాన్‌ బౌల్డ్‌ చేయగా.. పంత్‌ రనౌటయ్యాడు. ఐతే శ్రేయస్‌ అయ్యర్‌, కరుణ్‌ నాయర్‌ (30)లు ఎడాపెడా బౌండరీలు బాదేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దిల్లీ 7 ఓవర్లలో 72/2తో మెరుగ్గా కనిపించింది. కానీ ఎనిమిదో ఓఎవర్లో నాయర్‌ను ఫాల్క్‌నర్‌ ఔట్‌ చేయడంతో 47 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత శామ్యూల్స్‌ (1), అండర్సన్‌ (6), బ్రాత్‌వైట్‌ (11) కూడా ఎక్కువసేపు నిలువలేదు. ఐతే మరో వైపు నుంచి పెద్దగా సహకారం లభించకున్నా శ్రేయస్‌ విధ్వంసక బ్యాటింగ్‌ను కొనసాగించాడు. 14 ఓవర్లకు స్కోరు 121/6. దిల్లీ గెలవాలంటే 36 బంతుల్లో 75 పరుగులు అవసరం కాగా.. శ్రేయస్‌ ఫోర్ల మోత మోగిస్తూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. మరో వైపు కమిన్స్‌ కూడా ధాటిగా ఆడడంతో తర్వాతి మూడు ఓవర్లలో 52 పరుగులొచ్చాయి. కానీ 19వ ఓవర్లో కమిన్స్‌ను ఔట్‌ చేసిన ఫాల్క్‌నర్‌ మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చేశాడు. రెండో బంతికి శ్రేయస్‌ ఔట్‌ కావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. నెగ్గాలంటే దిల్లీ నాలుగు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ అమిత్‌ మిశ్రా (8 నాటౌట్‌) వరుసగా రెండు ఫోర్లు బాది దిల్లీని సంబరాల్లో ముంచెత్తాడు.

అంతకుముందు గుజరాత్‌ 195 పరుగుల భారీ స్కోరు చేయగలిగిందంటే ప్రధాన కారణం ఆరోన్‌ ఫించే. చెలరేగి ఆడిన అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 56 పరుగులకే కెప్టెన్‌ రైనా (6) సహా మూడు వికెట్లు కోల్పోయింది. డ్వేన్‌ స్మిత్‌ (8) రనౌట్‌ కాగా.. కమిన్స్‌ బౌలింగ్‌లో రైనా బౌల్డయ్యాడు. ఇషాన్‌ కిషన్‌ (34; 25 బంతుల్లో 5×4, 1×6) ధాటిగా ఆడి నిష్క్రమించాడు.క్రీజులోకి వచ్చిన ఫించ్‌.. ఎదుర్కొన్న రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మరోవైపు దినేశ్‌ కార్తీక్‌(40; 28 బంతుల్లో 4×4, 1×6) కూడా చక్కగా బ్యాటింగ్‌ చేయడంతో గుజరాత్‌ 15 ఓవర్లకు 134/3తో నిలిచింది. జహీర్‌ ఓవర్లో సిక్స్‌ కొట్టిన ఫించ్‌.. కార్తీక్‌ ఔటైనా ఆఖరి ఓవర్లలో విరుచుకుపడ్డాడు. 19వ ఓవర్లో షమి బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆఖరి ఐదు ఓవర్లలో గుజరాత్‌ 61 పరుగులు పిండుకుంది. దినేశ్‌ కార్తీక్‌తో నాలుగో వికెట్‌కు ఫించ్‌ 92 పరుగులు జోడించాడు.

- Advertisement -