ఓ..రాధా రాణి వస్తోంది

165
sriya saran
- Advertisement -

ఓ రాధా రాణి వస్తోందని సినీ నటి శ్రియా చేసిన ట్వీట్స్‌ ఆసక్తికరంగా మారాయి. తన కూతురుకు రాధా అని పేరు పెట్టడానికి గల కారణాలను వివరించిన శ్రియా…ఇద్దరికి కలిసివచ్చేలా రాధా అని పేరు పెట్టామని వెల్లడించింది.

‘రాధా’ అంటే రష్యన్‌లో సంతోషం అని అందుకే మా బిడ్డకు అదే పేరు ఫిక్సయ్యామని తలెఇపింది. మా అమ్మాయి పూర్తి పేరు రాధా శరన్ కొచ్చీవ్ అని వెల్లడించింది. రాధ పుట్టినప్పుడు మా అమ్మ తనతోనే ఉందని…పాప పుట్టిన తర్వాత చాలా పని ఉంటుందని, పిల్లలను పెంచటం చాలా కష్టమైన పని అయినా చాలా సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

ప్రతి రోజు నా గురించి నేను ఎంతో నేర్చుకున్నా. పాప డెలివరీ తర్వాత పిల్లలను పెంచే తల్లిదండ్రులపై నాకు మరింత గౌరవం పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం శ్రియా నటించిన పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

- Advertisement -