మత్తెక్కిస్తున్న శ్రద్దాదాస్‌..

77
- Advertisement -

సినిమా.. ఓ గ్లామర్‌ ప్రపంచం.. ఇక్కడ హీరోయిన్లకు గ్లామర్‌ ఉన్నంత వరకే అవకాశాలు వస్తాయి.. ఒకసారి ఫేడవుట్‌ అయితే ఇక అవకాశాలు రావడం కష్టమే.. అందుకే హీరోయిన్లు.. తమ గ్లామర్‌ పై ప్రత్యేక దృష్టి సారించి తమ అందాల వన్నె తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అందాలను ఆరబోస్తూ… సినిమాల్లో అవకాశాలు పొందుతారు. ఇప్పుడు టాలీవుడ్ లో అందాలను ఆరబోస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారనే చెప్పాలి. అయితే అందులో కొందరు తమ అందాలను ఆరబోస్తున్నా అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. దీంతో ఆ హీరోయిన్లు… అందాలను ప్రదర్శన చేస్తూ.. అవకాశాల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో చేరుతోంది శ్రద్దా దాస్‌.

తెలుగు చిత్రపరిశ్రమలో సిద్ధూ ప్రమ్‌ శ్రీకాకుళం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా.. ఆ తర్వాత ఆర్య 2, డార్లింగ్‌, నాగవల్లి తదితర చిత్రాల్లో నటించినా.. ఈ అమ్మడికి తగినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇటు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్‌ లో సైతం నటించినా శ్రద్దాకు అక్కడకూడా తగినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు తాజాగా శ్రద్దా దాస్‌ తమిళ, కన్నడ చిత్రపరిశ్రమల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అందాల ఆరబోతతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ అమ్మడు తాజాగా సోషల్‌ మీడియాలో హాట్‌ అందాలను చూపిస్తూ… కుర్రకారు గుండెల్లో బాంబులు పేలుస్తూ… రెచ్చిపోతోంది. అందాల ఆరబోతతో శ్రద్దాదాస్‌కు ఎన్ని అవకాశాలు వస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి 

చెమటలు పట్టిస్తున్న మీరాజాస్మిన్‌

బాలకృష్ణకు తప్పిన పెను ప్రమాదం

నేడు వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ రిలీజ్‌

- Advertisement -