- Advertisement -
రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత తీర్చేందుకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ టెండర్ల ద్వారా మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీగా ప్రకటించింది. అయితే, ఆరు నెలల్లో కోటి డోసుల వాక్సిన్లను సరఫరా చేయాల్సి ఉంటుందని షరతు విధించింది. నెలకు 1.5 మిలియన్ డోసులు విధిగా సరఫరా చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది.
ఇక రాష్ట్రంలో క్సిన్లు తీసుకునే అర్హత ఉన్న వారందరికీ ఉచితంగా టీకా వేయాలని నిర్ణయం తీసుకోగా ఈ మేరకు శరవేగంగా అడుగులు వేస్తోంది.
- Advertisement -