మరోసారి కొట్టుకున్నారు టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్, పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ – పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 23న హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌కు సమయం దగ్గర పడగా ఈ రెండు దేశాల దిగ్గజ ఆటగాళ్లు గొడవ పడడం కలకలం రేపుతోంది. మైదానంలోనే ఉన్న సమయంలో బ్యాట్ పట్టుకుని వెళ్లి మరీ హర్భజన్ సింగ్.. అక్తర్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. 8 దేశాలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి.
Thats our way of getting ready for Champions Trophy. @harbhajan_singh kee kehnday oh? pic.twitter.com/ZufYlOt7Y4
— Shoaib Akhtar (@shoaib100mph) February 9, 2025
Also Read:స్వర్ణ దేవాలయంలో రష్మికా!

