గతంలో పిల్లలకు చదువు చెప్పే క్రమంలో టీచర్ కొట్టినా, తిట్టినా ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెద్దలే కాకుండా, విద్యార్థులు కూడా టీచర్లపై తిరగబడుతున్నారు. ఒక్కోసారి టీచర్లు విద్యార్థులను కొట్టడం సహజం. కానీ దెబ్బలు తిన్న విద్యార్థి తిరగబడి టీచర్‌నే కొడితే?.. చైనాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
చైనాలోని ఓ స్కూల్ లో అల్లరి చేస్తున్న విద్యార్థిని టీచర్ మందలించారు. దీంతో రెచ్చిపోయిన ఆ విద్యార్థిని టీచర్‌పై తిరగబడింది. విద్యార్థి టీచర్ కు చెంప చూపిస్తూ కొట్టి చూపించమని సవాలు విసిరింది. దీంతో ఒళ్లుమండిన టీచర్ నిజంగానే ఆమె చెంప పగలగొట్టింది.
ఇంకేముందీ… ఆ విద్యార్థిని కూడా టీచర్‌పై చేయిచేసుకుంది. దీంతో బిత్తరపోయిన టీచర్ మరోసారి చెంపదెబ్బకొట్టారు. స్టూడెంట్ కూడా మళ్లీ అదే రీతిలో రియాక్ట్ అయింది. అంతటితో ఆగకుండా ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. వెంటనే అక్కడే ఉన్న విద్యార్థులు కలగజేసుకుని వారిద్దరినీ అదుపుచేయడానికి యత్నించారు. ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో కొందరు టీచర్‌కి సపోర్ట్ చేస్తే.. మరికొందరు విద్యార్థిని ప్రవర్తన సరిగా లేదని తిట్టిపోశారు.
https://www.youtube.com/watch?time_continue=1&v=spgGJToEEz0