ఈ సుకేష్‌ చంద్రశేఖర్ ఎవరు?

193
Cars, Cash, Con: The Lavish Lifestyle of Dinakaran's 'Middleman' Sukesh

తమిళనాట జయలలిత వారసత్వాన్ని అందిపుచ్చుకునే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ప్రయత్నించిన టీటీవీ దినకరన్ కు గట్టి షాకే తగిలింది. ఏకంగా ఎన్నికల కమిషన్ అధికారులకే లంచం ఇవ్వజూపి అడ్డంగా బుక్కయ్యాడు దినకరన్. ఈ కేసులో పట్టుబడిన నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ దినకరన్ పేరు చెప్పడంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై ఐపీసీ 170. 120, 8 పీఓసీ తదితర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.

 images

ఎన్నికల కమీషన్‌కే లంచం ఇచ్చేంత ధైర్యం చేసిన ఈ సుకేష్‌ చంద్రశేఖర్ ఎవరు? వివరాళ్లోకి వెళ్తే.. సుకేష్ వయసు 27 ఏండ్లు. యువకుడే.. అయినా రాజకీయ నాయకుడినని చెప్పుకుంటాడు. బాలీవుడ్ సినిమా బంటీ ఔర్ బబ్లీ సినిమా తరహాలో లీనా మారియా పాల్ అనే నటితో కలిసి అనేక మందిని బురిడీ కొట్టించాడు. దక్షిణాది రాష్ర్టాల అందరు ముఖ్యమంత్రులకు బంధువునని చెప్పుకొని పలు మోసాలకు పాల్పడ్డాడని పోలీసు రికార్డులు పేర్కొంటున్నాయి. 2010లో చెన్నైలో దిగిన తర్వాత డీఎంకే అధినేత కరుణానిధికి మనువడినని కూడా చెప్పుకొని పలు మోసాలకు పాల్పడ్డాడు. కరుణానిధి కుమారుడు ఎంకే అళగిరికి బంధువునని చెప్పుకొని కూడా మోసాలు చేశాడు. ఆయన కార్లలో ఒక దానికి మెంబర్ ఆఫ్ పార్లమెంటు స్టిక్కర్ కూడా ఉంది.

getimage

కొన్నేండ్ల క్రితం కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసిన కేసులో కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. వివిధ రాష్ర్టాల్లో సుఖేశ్‌పై దాదాపు 50 కేసులు ఉన్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయనపై కేసులు ఉన్నాయి. పెద్ద ఎత్తున అంగరక్షకులతో కలిసి బుగ్గకార్లలో తిరుగుతూ, తాను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తినని, రాజకీయ నేతలు తనను గౌరవిస్తుంటారని తను లక్ష్యంగా చేసుకున్నవారిని నమ్మించేవాడు.

sukesh-cars

బెంగళూరుకు చెందిన సుఖేశ్‌ చిన్నతనం నుంచే నేరాలకు అలవాటుపడ్డాడు. రేసు కార్లను నడుపడంలో నిపుణుడైన సుఖేశ్.. విలాసవంతమైన కార్ల మీద మనసుపారేసుకుని, వాటిని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడేవాడని పోలీసులు చెప్తున్నారు. డెంటల్ కోర్సు చేసేందుకు బెంగళూరుకు వచ్చిన లీనా మారియా పాల్ అనే యువతికి సినిమాల్లో ఆసక్తి ఉండటంతో ఆమెకు ఇండస్ట్రీలో బ్రేక్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. తమిళ నటుడు మహేంద్రన్ వద్దకు కూడా ఆమెను తీసుకెళ్లాడని తెలుస్తున్నది. అయితే, కాలక్రమేణా సుఖేశ్ మోసాల్లో ఆమె కూడా భాగస్వామిగా మారింది.